Oil Farm Cultivation: సిరులు కురిపిస్తున్న ఆయిల్‌పాం పంట సాగుకు నారు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయిల్‌పాం మొక్కలను సరఫరా చేయాలని కోస్టారికా నుంచి ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ వరకూ అనేక దేశాల కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ ఏడాది కచ్చితంగా 5లక్షల ఎకరాల్లో ఈ పంట వేయించాలని రైతులకు ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. తొలకరి వర్షాలు జోరందుకున్నా ఆయిల్‌పాం నారు పెద్దగా దొరకడం లేదు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా పామాయిల్ కంపెనీలు పెంచుతున్న నర్సరీల్లోని మొక్కలన్నీ నాటినా ఈ ఏడాది 2లక్షల ఎకరాలకు మించి సాగు సాధ్యంకాకపోవచ్చని అంచనా.
సిరులు కురిపిస్తున్న పంట.. నారు కోసం లోకమంతా వేట.. - ఆయిల్‌పాం పంట సాగుకు నారు దొరక్క తీవ్ర ఇబ్బందులు
Oil Farm Cultivation: రాష్ట్రంలో ఆయిల్‌పాం మొక్కల సరఫరాకు తీవ్రకొరత ఏర్పడింది. నారు కోసం వివిధ దేశాల్లోని అనేక కంపెనీలను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ ఏడాది కచ్చితంగా 5 లక్షల ఎకరాల్లో ఈ పంట వేయించాలని రైతులకు ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. కానీ కనీసం 2 లక్షల ఎకరాలకు కూడా నారు దొరకని స్థితి నెలకొంది.
రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య(ఆయిల్‌ఫెడ్), ఉద్యానశాఖ అధికారుల బృందం తాజాగా థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి నర్సరీలను పరిశీలిస్తోంది. నారు ఉంటే తెలంగాణకు సరఫరా చేయాలని కోరుతోంది. కోస్టారికా కంపెనీల నుంచీ పెద్దగా మద్దతు లేదు. ఇప్పటికిప్పుడు నారు వచ్చినా దాన్నిక్కడి కంపెనీలు నర్సరీల్లో ఆరునెలలపాటు పెంచి, తర్వాతే రైతులకివ్వాలనే నిబంధన ఉన్నందున ఈ ఏడాదికిక పెద్దగా లభించకపోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. నారు కొరత కారణంగా ఈ ఏడాది 2లక్షల ఎకరాలు, వచ్చే ఏడాది 3లక్షల ఎకరాలు, తరవాతి ఏడాది మరో 5లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుచేసేలా ప్రణాళికలను మారుస్తున్నారు. నారుకు విదేశీ కంపెనీలే దిక్కవడం వల్ల ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం ఒకేసారి పెంచడం సాధ్యం కావడం లేదని ఉద్యానశాఖ వర్గాలు ‘ఈనాడు’కు చెప్పాయి.
మరో 5 జిల్లాల్లో విస్తరణ..తాజాగా మరో 5 జిల్లాల్లో ఆయిల్‌పాం సాగుకు కంపెనీలను ఎంపిక చేయాలని ఉద్యానశాఖ తాజాగా టెండర్లు పిలిచింది. రంగారెడ్డిలో 55వేలు, మెదక్‌లో 50వేలు, సంగారెడ్డిలో 47వేలు, వికారాబాద్‌లో 31వేలు, మేడ్చల్‌లో 10వేలు కలిపి మొత్తం లక్షా 93వేల ఎకరాల్లో అదనంగా పంటసాగుకు టెండర్లు వేయాలని పామాయిల్ కంపెనీలను కోరుతూ ప్రకటన జారీచేసింది. నారు కొరత లేకుంటే ఇప్పటికే 5లక్షల ఎకరాల్లో మొక్కలు నాటించేవారమని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.