మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం నుంచి కర్ణాటక ఉత్తర ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు - telangana rain updates
నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్లే వాన పడుతుందని తెలిపింది.
తెలంగాణ వెదర్ అప్డేట్స్, తెలంగాణ వాతావరణ వార్తలు, తెలంగాణలో వర్షాలు
శనివారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణంకన్నా 23 శాతం వరకు అదనంగా పెరిగింది. ప్రజలు ఉక్కపోతలతో ఇబ్బందులు పడ్డారు