టీఎస్ బీపాస్ ప్రారంభించిన వంద రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతి ఇచ్చామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి.. 600 గజాల వరకు దరఖాస్తుల ఆధారంగా ఆన్‌లైన్ అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ఆన్‌లైన్‌లోనే ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ జారీచేస్తున్నామని తెలిపారు.
100 రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతులు ఇచ్చాం: కేటీఆర్ - కేటీఆర్ వార్తలు
టీఎస్-బీపాస్‌కు మంచి స్పందన వస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి ఆన్‌లైన్‌లోనే అనుమతులిస్తున్నామన్నారు. ప్రారంభించిన 100 రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతి ఇచ్చినట్లు శాసనసభకు వివరించారు.
ktr
హౌజింగ్ బోర్డులోని ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. కేపీహెచ్బీలో ఇళ్ల పునర్‌నిర్మాణానికి ఉచితంగా అనుమతులు కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేయగా.. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామకంఠం భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
ఇదీ చదవండి :ఎలక్ట్రానిక్స్ తయారీకి గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తాం : కేటీఆర్