ఈ ఏడాది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ సంచాలకురాలు నాగరత్నం తెలిపారు. జూన్ నుంచి సెప్టెంబర్లో సాధారణం కన్నా అధికంగా వానలు పడతాయని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాలిక సగటు 98 శాతం ఉందని చెప్పారు.
తెలంగాణలో ఈ ఏడు విస్తారంగా వర్షాలు
ఈ ఏడు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నం వెల్లడించారు. జూన్ నుంచి సెప్టెంబర్లో సాధారణం కన్నా అధికంగా వానలు పడతాయని తెలిపారు.
తెలంగాణలో వర్షపాతం, తెలంగాణలో 2021లో వర్షపాతం, తెలంగాణ వాతావరణ అప్డేట్స్
ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఉండనున్నాయని నాగరత్నం వెల్లడించారు. పసిఫిక్, హిందూ సముద్రాల్లో ప్రస్తుత ఉష్ణోగ్రతల ఆధారంగా వర్షపాతాన్ని అంచనా వేసినట్లు వివరించారు. మే చివరినాటికి నైరుతి రుతుపవనాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నంతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చదవండి :ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఐఎండీ