బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను గురువారం అర్ధరాత్రి తరవాత తీరం దాటిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. తమిళనాడులోని కరైకల్, మామల్లపురం మధ్య తీరం దాటే సమయంలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయన్నారు. దీని ప్రభావంతో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. ఉత్తర తెలంగాణపై తుపాను ప్రభావం పెద్దగా ఉండదని రాజారావు తెలిపారు. తుపాను వల్ల చలితీవ్రత తగ్గిందని తుపాను వెళ్లిపోయాక చలి పెరుగుతుందన్నారు.
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు..! - telangana weather updates today
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను గురువారం తెల్లవారుజామున తీరం దాటనుందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. దీనిప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు..!
మార్కెట్లకు పంటలు తేవద్దు
తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున గురు, శుక్రవారాల్లో పంటలను కోయవద్దని, మార్కెట్లకూ తేవద్దని రైతులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. పంట నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు.
- ఇదీ చూడండితీవ్ర తుపానుగా మారిన నివర్