Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రులోని ఆలయంలో చోరీకి యత్నించిన దొంగల్ని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. గతరాత్రి అనుమానంగా సంచరిస్తున్న కొందరు దుండగులను గ్రామస్థులు గుర్తించి అప్రమత్తమయ్యారు.. వారిని వెంబడించారు. దొంగల ముఠాలో ఇద్దరినీ పట్టుకోగా.. మరికొందరు తప్పించుకుని పారిపోయారు.
చోరీ చేస్తే కోటి రూపాయలు ఇస్తారంటా... ఎందుకో తెలుసా! - పల్నాడు తాజా వార్తలు
Robbery: ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రులో.. ఆలయంలో చోరీకి యత్నించిన దొంగల్ని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే.. దొంగల ముఠాలో కొందరు తప్పించుకుని పారిపోయారు. ఇద్దరిని గ్రామస్థులు పట్టుకుని వారిని ప్రశ్నించారు. కాగా.. ఆలయంలోని కలశం చోరీ చేస్తే.. కోటి రూపాయలు ఇస్తామన్నారని తెలిపారు.
పట్టుకున్న ఇద్దరు దొంగలను ప్రశ్నిస్తే మొత్తం 8మంది చోరీ కోసం వచ్చినట్లు చెప్పారు. వారిలో గురిజేపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, కట్టుబడివారిపాలెంకు చెందిన రమేష్, ఒంగోలు శ్రీనివాసరావు, మార్టూరు శ్రీనివాసరావు, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారని వివరించారు. వారు తిరుపతి నుంచి వచ్చారని చెప్పారు.
ఆలయంలోని ధ్వజస్తంభానికి ఉన్న కలశం చోరీకి వచ్చామని దుండగులు చెబుతున్నారు. దీన్ని చోరీ చేస్తే వెంకటేశ్వర్లు అనే అతను కోటి రూపాయలు ఇస్తామన్నాడని చోరీకి యత్నించి చిక్కిన నిందితుడు తెలిపాడు. గతంలోనూ గ్రామంలోని రామాలయంలో చోరీకి యత్నించిన వారికి పట్టుకుని.. పోలీసులకు అప్పగించామన్నారు. అప్పటి నుంచి ఆలయం వద్ద నిఘా పెట్టామని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామస్థులు పట్టుకున్న ఇద్దరు దొంగలు అనిల్, ఈశ్వర్‌ను.. నరసరావుపేట గ్రామీణ పోలీసులు స్టేషన్‌కు తరలించారు.