తెలంగాణ

telangana

ETV Bharat / city

Murder: స్నేహితుడిని నరికి చంపిన యువకుడు - తాపీ మేస్త్రి హత్య

ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పట్టపగలే హత్య జరగడం కలకలం రేపింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని అతని స్నేహితుడు కత్తితో నరికి చంపాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Murder: పట్టపగలు స్నేహితుడిని నరికి చంపిన యువకుడు
Murder: పట్టపగలు స్నేహితుడిని నరికి చంపిన యువకుడు

By

Published : May 2, 2022, 1:33 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని అతని స్నేహితుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. స్థానిక విఘ్నేశ్వర థియేటర్‌ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కర్‌నగర్‌లో నివాసముంటున్న తలాటం శివ(28) తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో రాజీవ్‌ గృహకల్పలో నివాసం ఉన్న సమయంలో అతనికి నరాల మణికంఠతో స్నేహం ఏర్పడింది.

తలాటం శివ

కొంతకాలం తర్వాత వీరి మధ్య వివాదం రావడంతో అక్కడి నుంచి వచ్చి సోదరుడితో కలిసి భాస్కర్‌నగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం తన పుట్టినరోజు కావడంతో బిర్యానీ కొంటుండగా.. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న మణికంఠ వేటకత్తితో ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. దారుణానికి పాల్పడిన మణికంఠ నేరుగా పోలీస్​ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ABOUT THE AUTHOR

...view details