అనంతపురం జిల్లా నల్లమాడలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరిన ఆమెను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతోంది. తనపై.. నల్లమాడ సీఐ దురుసుగా ప్రవర్తించి.. దాడి చేశాడని ఆరోపించింది. అతనిపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ.. బాధిత మహిళ కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
సీఐ తీరుకు మహిళ ఆత్మహత్యాయత్నం - అనంతపురం క్రైమ్ వార్తలు
అనంతపురం జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల తీరే ఇందుకు కారణమని ఆరోపించింది.
సీఐ తీరుకు మహిళ ఆత్మహత్య