గుంటూరు మండల కేంద్రం ఘంటసాలలో రైతు కుటుంబానికి చెందిన వేమూరి బాబూ రాజేంద్రప్రసాద్ ‘తాత-నాయనమ్మ’(వెంకట సుబ్బారావు- అన్నపూర్ణమ్మ)ల వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయన ముత్తాత వేమూరి వెంకట్రామయ్య ముద్రింపజేశారు.
ఈ శుభలేఖకు 96 సంవత్సరాలు - ghantasala latest news
పరిణయ వేడుకలో ప్రతీదీ ప్రత్యేకమే. ప్రతి ఘట్టం మధుర జ్ఞాపకమే. అందులో శుభలేఖలదీ ప్రత్యేక పాత్రే.. వాటిని ఫ్రేములు కట్టించి జాగ్రత్త చేయటం ఈ రోజుల్లో సాధారణం.. కానీ గుంటూరులోని ఘంటసాలకు చెందిన ఓ వ్యక్తి 96 ఏళ్ల తమ తాత-నాయనమ్మ వివాహ ఆహ్వాన పత్రికను అపురూపంగా భద్రపరిచాడు.
![ఈ శుభలేఖకు 96 సంవత్సరాలు guntur news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10032184-390-10032184-1609140599834.jpg)
ఈ శుభలేఖకు 96 సంవత్సరాలు
ఆ శుభలేఖను తీపి గుర్తుగా ఆస్తి దస్తావేజులులా గత 96 సంవత్సరాలుగా భద్రంగా దాస్తున్నారు బాబూ రాజేంద్రప్రసాద్. అలాగే ఆయన తండ్రి - తల్లి (వేమూరి పరాత్పరరావు-రాధమ్మ) వివాహమహోత్సవ పత్రికను సైతం 64 ఏళ్లుగా భద్రపరచడం విశేషం.