Yoga day in vizag: రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు.. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఏర్పాట్లు చేసింది. విశాఖపట్నం పోర్టు అథారిటీ, విశాఖ జిల్లా అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూన్ 21న ఉదయం 5.30 గంటలకు ఆర్కే బీచ్ వద్ద ఉన్న కాళీ మాతా ఆలయం ఎదురుగా.. భారీ ఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోర్టు ఉన్నతాధికారులు పాల్గొంటారు. వీరితోపాటు నగర వాసులు పెద్దఎత్తున పాల్గొనేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు.
Yoga day in vizag: 'విశాఖ తీరాన యోగా దినోత్సవం.. ఎవరైనా పాల్గొనవచ్చు' - అంతర్జాతీయ యోగా దినోత్సవం
Yoga day in vizag: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏపీలోని విశాఖపట్నం పోర్టు అథారిటీ, జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 5.30 గంటల కల్లా బీచ్ రోడ్డులోని కాళీ మాతా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ఆశావహులు రావాలని అధికారులు కోరారు.
Yoga day in vizag
యోగాపట్ల ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే రేపు బీచ్ రోడ్డులో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గనవచ్చని పోర్టు యాజమాన్యం తెలిపింది. ఇందుకోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని.. అయితే ఎవరి యోగా కిట్లు వారే సమకూర్చుకోవాలని తెలిపింది. ఆసక్తి ఉన్న వారు యోగా దినోత్సవ వేదిక వద్దకు వచ్చి నేరుగా పాల్గొనవచ్చునని ప్రకటించారు.
ఇవీ చదవండి: