నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తమ 3 వేల గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు తెరాస నాయకులు ప్రయత్నిస్తున్నారని రమావత్ పూల్‌సింగ్ అనే గిరిజనుడు ఆరోపించారు. అర్సపల్లిలోని సర్వే నెంబర్ 202/E లో ఉన్న ఖరీదైన స్థలాన్ని ఆక్రమించేందుకు.. గ్యాంగులుగా వచ్చి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రిస్‌ఖాన్, మహమ్మద్, నయీం సహా మరికొందరు బెదిరింపులకు దిగుతున్నారని పూల్‌సింగ్ ఆరోపించారు. వారి నుంచి రక్షించాలంటూ తన కుటుంబంతో సహా కలెక్టరేట్‌కు వచ్చి.. ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం చేయడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
అర్సపల్లిలోని సర్వే నెంబర్ 202/ఈలో మాకు 3 వేల గజాల స్థలం ఉంది. స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు మా దగ్గర ఉన్నాయి. అయినా దౌర్జన్యంగా మాపై దాడి చేసి.. మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇద్రిస్‌ఖాన్, మహమ్మద్ భాయ్, నయీం మరికొంతమంది వారి గ్యాంగులతో వచ్చి మాపై దాడి చేశారు. దీనిపై మేమే ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డ్యూటీకి వెళ్లాలన్నా భయంభయంగా వెళ్లాల్సి వస్తుంది.
-పూల్‌సింగ్, బాధితుడు
LAND KABZA: 'తెరాస నాయకులు నా భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారు' ఇదీ చూడండి: తెలంగాణలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిపోయింది: డీహెచ్ శ్రీనివాస్