బిట్‌కాయిన్ విలువ మరింత పెరిగి, మరో కొత్త జీవనకాల గరిష్ఠాన్ని చేరింది. గురువారం తొలిసారి 69000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. బిట్‌కాయిన్ ఫ్యూచర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా బిట్‌కాయిన్ స్ట్రాటజీ ఈటీఎఫ్ పేరుతో కొత్త ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ మంగళవారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైంది.
స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన తొలిరోజే దీనికి మదుపర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ ప్రభావంతో మంగళవారం రాణించిన బిట్‌కాయిన్.. ఆ జోరును బుధ, గురవారాల్లోనూ కొనసాగించింది. బిట్‌కాయిన్ విలువ 69000 డాలర్లకు చేరింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిట్‌కాయిన్ విలువ 120 శాతం పైగా పెరిగినట్లయ్యింది.