హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల(jagan CBI cases news) కేసుల విచారణ కొనసాగుతోంది. ఈడీ వాన్‌పిక్, గృహ నిర్మాణ కేసుల విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు హాజరుకు ఏపీ సీఎం జగన్‌కు కోర్టు మినహాయింపునిచ్చింది. సీబీఐ కోర్టుకు(CBI COURT) ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
JAGAN CBI CASES: జగన్ అక్రమాస్తుల కేసు.. హాజరైన ఎంపీ విజయసాయి రెడ్డి - jagan cbi case
జగన్ అక్రమాస్తుల కేసులో(jagan CBI cases news) హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో(Nampally CBI Court) విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాగా.. ఏపీ సీఎం జగన్‌కు కోర్టు మినహాయింపునిచ్చింది. వాన్‌పిక్, లేపాక్షి ఈడీ కేసుల్లో ఏపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాజరు కాగా.. ఈడీ లేపాక్షి, గృహనిర్మాణ కేసుల విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడింది.
హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో c జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
వాన్‌పిక్, లేపాక్షి ఈడీ కేసుల్లో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాజరుకాగా... లేపాక్షినాలెడ్జ్ హబ్ కేసులో జె. గీతారెడ్డి హాజరయ్యారు. నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రకాశ్‌తో పాటు ఐఏఎస్ మురళీధర్ రెడ్డి, విశ్రాంత అధికారులు బి.పి. ఆచార్య, శామ్యూల్, మన్మోహన్ సింగ్, బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఈడీ లేపాక్షి, గృహనిర్మాణ కేసుల విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడింది.
ఇదీ చదవండి: