తెలంగాణ

telangana

ETV Bharat / city

JAGAN ED CASE: జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ల దాఖలుకు గడువు కోరిన ఈడీ - సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వార్తలు

హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఏపీ సీఎం జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు ఈడీ గడువు కోరింది. ఈ కేసులో తన పేరు తొలగించాలని రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్ దాఖలు చేశారు.

CM Jagan Cases
జగన్ అక్రమాస్తుల కేసు

By

Published : Sep 30, 2021, 10:47 PM IST

హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో ఇవాళ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. రాంకీ ఫార్మా కేసులో ఈడీ ఛార్జిషీట్‌పై సీబీఐ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసులో తన పేరు తొలగించాలని రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్ దాఖలు చేశారు.

మరోవైపు ఏపీ సీఎం జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు ఈడీ గడువు కోరింది. దాల్మియాలో ఈశ్వర్ సిమెంట్స్ విలీనంపై వివరాలివ్వాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అనంతరం రాంకీ, జగతి, వాన్‌పిక్ కేసులతో పాటు దాల్మియా, అరబిందో-హెటిరో కేసుల విచారణను అక్టోబర్‌ 7కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: badvel by elections: ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలి: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details