ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోలీసు శాఖ సీనియారిటీ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఐల ప్రమోషన్లకు ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా ఒకట్రెండు రోజుల్లో పదోన్నతుల జీవో వెలువడనుంది.
పోలీసు అధికారుల పదోన్నతుల ప్రక్రియకు ఆమోదముద్ర
రాష్ట్ర పోలీసు శాఖలో సీనియారిటీ జాబితా సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. హైకోర్టు ఆదేశాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియారిటీకి అనుగుణంగా ఆ శాఖలోని అధికారులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రాష్ట్ర పోలీసు శాఖలో త్వరలో 122 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు లభించనున్నాయి. తాజాగా 74 మంది డీఎస్పీలుకు అదనపు ఎస్పీలుగా, 41 మందికి నాన్‌కేడర్ ఎస్పీలుగా ప్రమోషన్ రానుంది. అయితే వీరిలో 13 మంది ఇప్పటికే నాన్‌కేడర్ ఎస్పీలుగా కొనసాగుతుండగా.. గతంలోనే వీరికి తాత్కాలిక పదోన్నతులు కల్పించారు. కొందరు జిల్లా ఎస్పీలుగా పనిచేస్తుండగా.. ప్రస్తుతం వారిని నాన్‌కేడర్ ఎస్పీలుగా రెగ్యులరైజ్ చేశారు. పదోన్నతి పొందిన అధికారులు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్నారు.
ఇదీ చదంవడి:ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో లాక్‌డౌన్ విధించం: కేసీఆర్