ప్రభుత్వ పథకాలు అప్పనంగా అనుభవించేందుకు పుట్టారా... అంటూ ఓ విద్యార్థిపై విచక్షణ రహితంగా ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని ఎస్.ఆర్.ఆర్ బాయ్స్ హై స్కూల్లో జరిగింది.
లాగు సిద్ధార్థ అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అమ్మఒడి పథకం ద్వారా సిద్ధార్థ తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 15,000 అందరిలాగానే జమయ్యాయి. పాఠశాలలో ఉపాధ్యాయుడైన శ్రీనివాసరావు సిద్ధార్థను పిలిచి.. మీ అమ్మ, నాన్న ఏమి చేస్తారు. ప్రభుత్వం డబ్బు కాజేసేందుకే పుట్టారా అంటూ విచక్షణ రహితంగా కొట్టి సిద్ధార్థ తలను గోడకేసి గుద్దాడు. ఎందుకు సార్ కొడుతున్నారంటే కొడితే కొట్టించుకోవాలన్న సమాధానం ఇచ్చారని విద్యార్థి వాపోతున్నాడు.