తెలంగాణ

telangana

ETV Bharat / city

పీఎస్ఎల్వీసీ 49 విజయం..షార్ వద్ద ప్రజల ఆనందం - isro news

2020 సంవత్సరంలో ఏపీలోని నెల్లూరు జిల్లా షార్ నుంచి మొదటగా ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ49 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

పీఎస్ఎల్వీసీ 49 విజయం..షార్ వద్ద ప్రజల ఆనందం
పీఎస్ఎల్వీసీ 49 విజయం..షార్ వద్ద ప్రజల ఆనందం

By

Published : Nov 8, 2020, 2:42 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పది నెలల విరామం తర్వాత ఇస్రో పంపించిన పీఎస్ఎల్వీసీ-49 ప్రయోగం విజయవంతం చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ ప్రయోగం ద్వారా పది ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపారు.

రాకెట్ ప్రయోగానికి సందర్శకులు వచ్చేందుకు అనుమతి లేకపోయినా ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలలో చేరుకుని పులికాట్ సరస్సు నుంచి వీక్షించారు. సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. షార్ ప్రధాన గేట్ వద్దకు చేరుకుని ఆనందం వ్యక్తం చేశారు.

పీఎస్ఎల్వీసీ 49 విజయం..షార్ వద్ద ప్రజల ఆనందం

ఇదీ చూడండి:పర్వదినాల మాసం... మహిమాన్విత కార్తికం

ABOUT THE AUTHOR

...view details