బ్రిటిష్ దౌత్యాధికారులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ జాన్ థాంప్సన్ పాల్గొన్నారు. కొవిడ్ నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై చర్చించారు. కొవిడ్ నివారణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్ హైకమిషనర్ ప్రశంసించారు.
ఏపీకి బ్రిటన్ సహకారం చాలా అవసరం: సీఎం జగన్ - జగన్ తాజా వార్తలు
ఏపీకి బ్రిటన్ సహకారం చాలా అవసరమని సీఎం జగన్ పేర్కొన్నారు. బ్రిటిష్ దౌత్యాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్ హైకమిషనర్ ప్రశంసించారు.
ఏపీకి బ్రిటన్ సహకారం చాలా అవసరం: సీఎం జగన్
రోజుకు సగటున 62 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వారికి చెప్పారు. కరోనా రోగులు త్వరగా ఆస్పత్రికి రావడం చాలా ముఖ్యమని జగన్ అభిప్రాయపడ్డారు. డిసెంబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ వస్తుందని చెబుతున్నారన్న సీఎం... బ్రిటన్ సహకారం రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... 'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'
TAGGED:
జగన్ తాజా వార్తలు