సీఎం కేసీఆర్ ఆదేశాలతో లాక్ డౌన్ ఈ నెల 30 వరకు పొడిగిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్‌పై ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇదివరకే ఆదేశించారు.
లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ - సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు.
లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 30 వ తేదీ వరకు పొడిగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకు 20 గంటల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు సడలింపులు ఉంటాయి. లాక్ డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.