ఏపీలో రెండు పోర్టులు, నాలుగు చేపల రేవుల అభివృద్ధికి రూ.6,425.76 కోట్లతో రూపొందించిన టెండరు ప్రతిపాదనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం న్యాయసమీక్షకు పంపింది. 2020-21 ప్రామాణిక ధరల (స్టాండర్డ్ రేట్ల) ప్రకారం టెండరు ప్రతిపాదనలను రూపొందించింది. టెండరు పత్రాలను పరిశీలించి అభ్యంతరాలను తెలపడానికి వారం రోజుల గడువిచ్చింది.
* ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు మొదటి దశ అభివృద్ధికి గతంలో 2019-20 ప్రామాణిక ధరల ప్రకారం రూపొందించిన టెండరు ప్రతిపాదనను న్యాయ సమీక్షకు పంపింది. వాటిని వెనక్కు తీసుకుని 2020-21 ప్రామాణిక ధరల ప్రకారం అదనంగా ఒక బెర్తు నిర్మాణం, డ్రెడ్జింగ్ పనుల నిర్వహణకు రూ.2,646.84 కోట్లతో కొత్తగా టెండరు ప్రతిపాదనలను రూపొందించింది.