Good news for sanitation workers: రాష్ట్ర సర్కార్ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త తెలిపింది. వారి వేతనాలను 7,500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో 31ని విడుదల చేసిన సర్కారు.. దీనిని నర్సింగ్ పాఠశాలలు, కళాశాలలకు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. బెడ్ ఆక్యుపెన్సీ ఆధారంగా పారిశుద్ధ్య కార్మికుల నియామకం ఉండాలని పేర్కొంది. గతేడాది నమోదైన బెడ్ ఆక్యుపెన్సీ లేదా ఆసుపత్రికి మంజూరైన పడకల్లో 50శాతం అందులో ఏది ఎక్కువయితే దాని ఆధారంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది.
వారికి సర్కార్ గుడ్న్యూస్... వేతనాలు పెంచుతూ జీవో - జీవో 31 తాజా వార్తలు
Good news for sanitation workers: పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి వేతనాలను పెంచుతూ జీవో 31ని విడుదల చేసింది. దీనిని నర్సింగ్ పాఠశాలలు, కళాశాలలకు వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం వైద్య కళాశాలల్లో ప్రతి 7,000 ఎస్ఎఫ్టీకి ఒక పారిశుద్ధ్య కార్మికుడిని నియమించే విధానం అమలులో ఉంది. ఇదే విధానం నర్సింగ్ కళాశాలలు, పాఠశాలలకూ వర్తించనుంది. ఇందుకోసం 200 కంటే ఎక్కువ పడకలు ఉన్న ఆసుపత్రులకు ప్రత్యేకంగా టెండర్లు పిలవాలని సర్కార్ పేర్కొంది. జిల్లాల్లో టెండర్ ప్రక్రియ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు నిర్వహిస్తాయని స్పష్టం చేసింది. ఇక ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య ప్రమాణాలు పెంపొందించేందుకు ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు కలిసి పనిచేస్తాయని పేర్కొంది.
ఇదీ చదవండి:'డిసెంబర్లో అసెంబ్లీ రద్దు.. మార్చికల్లా ఎన్నికలు.. అధికారంలోకి కాంగ్రెస్..'