Cabinet Meeting: మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత ఏపీ కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో సమావేశం జరగనుంది. దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్‌లో చర్చించి.. దానిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత... నేడు తొలి కేబినెట్ భేటీ - ఏపీ కేబినెట్ తాజా సమాచారం
Cabinet Meeting: మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత తొలిసారి ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో ఈ రోజు మద్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
cabinet meeting
దిశా చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని సమాచారం. అమ్మ ఒడి పథకం, గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:యూట్యూబ్లో ఆ వీడియో చూశాడు.. వ్యాపారి నుంచి రూ. 45 లక్షలు కొల్లగొట్టాడు