నెల్లూరులోని సిద్దేంద్రయోగి కళాక్షేత్రంలో కూచిపూడి శిక్షణ ఇస్తారు. అక్కడ చాలా మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. అద్భుత భంగిమలతో ఆకట్టుకుంటున్న ఈ యువతులు... రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోనూ ప్రతిభను చాటుకుంటున్నారు. ఒక్కొక్కరు వందకు పైగా ప్రదర్శనలు చేసి ప్రశంసలు అందుకున్నారు.
పాశ్చాత్య నృత్యంపై మనసు..
ప్రస్తుతం... చాలామంది పాశ్చాత్య నృత్యంపై మనసు పారేసుకుంటున్నారు. సంప్రదాయ నాట్యంపై ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలో.. యువతలో అవగాహన పెంచడానికి బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు వీరంతా. సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే కళామ్మ తల్లిని బతికించుకుందామని ఊరురా తిరుగుతున్నారు.
ఆన్‌లైన్ తరగతుల వినియోగం పెరిగి...
కూచిపూడి వల్ల ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవచ్చు. అక్కడక్కడ.... ఈ కళపై ఆసక్తి కనబరుస్తున్న ఔత్సాహికులు ఉన్నప్పటికీ... నేర్పించే వారు కనిపించట్లేదు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతుల వినియోగం పెరగడంతో... తెలుగురాష్ట్రాలలో ఎక్కడున్నా ఆన్‌లైన్ ద్వారా కుచిపూడిలో శిక్షణ పొందవచ్చు అంటున్నారు...ఈ నాట్య మయూరాలు.