Entrance Tests New Schedule: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల దృష్ట్యా వాయిదా పడిన ప్రవేశ పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల్లో ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్.. ఉండగా వాటి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నెల 30, 31న ఎంసెట్ (అగ్రికల్చర్)ను నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఈసెట్ ను ఆగస్టు 1న, పీజీఈసెట్‌ను ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్, ఈసెట్ తాజా షెడ్యూలు విడుదల.. - పీజీఈసెట్ తాజా షెడ్యూల్
14:21 July 19
వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఖరారు
ఎడతెరపి లేకుండా కొనసాగిన వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం మొదట మూడు రోజులు సెలవులు ప్రకటించటంతో.. జులై 13న నిర్వహించాల్సిన ఈసెట్‌ను అధికారులు వాయిదా వేశారు. మిగతా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపారు. అయితే... జులై 14, 15న భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆ సెలవులు కాస్తా మరో మూడు రోజులు కొనసాగాయి. ఫలితంగా.. ఆ రెండు రోజుల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను విద్యామండలి వాయిదా వేసింది. కాగా.. 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా నిర్వహిస్తున్నారు.
వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూలు..
- ఈనెల 30, 31న ఎంసెట్ (అగ్రికల్చర్)
- ఆగస్టు 1న ఈసెట్: ఉన్నత విద్యామండలి
- ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్
ఇవీ చూడండి: