ఆర్టీసీ ప్రభుత్వ, తాత్కాలిక ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తూ, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చట్టప్రకారం నేరమని రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేశ్ భగవత్, సజ్జనార్ వేర్వేరుగా ప్రకటనలో తెలిపారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ సూచనతో విధులకు హాజరయ్యే వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరైనా విధుల్లో చేరాలనుకుంటే నిర్భయంగా చేరవచ్చని.. ఎవరైనా ఇబ్బందులు పెట్టినా, భయపెట్టినా తమ దృష్టికి తీసుకుకావాలని కార్మికులకు సూచించారు.
'విధులకు హాజరయ్యే ఆర్టీసీ ఉద్యోగుల భద్రత మాదే' - tsrtc strike today news
విధులకు హాజరయ్యే జంటనగరాల ఆర్టీసీ ఉద్యోగులందరికి పూర్తి భద్రత కల్పిస్తామని... రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేశ్ భగవత్, సజ్జనార్ వేర్వేరు ప్రకటనలో తెలిపారు. విధులకు ఆటంకం కలిగిస్తూ, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చట్టప్రకారం నేరమని హెచ్చరించారు.
"విధులకు హాజరయ్యే ఆర్టీసీ ఉద్యోగుల భద్రత మాదే"