ట్యాంక్ బండ్‌పై ఆర్టీసీ ఐకాస తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు భాజపా మద్దతు ప్రకటించడం వల్ల ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధంతో పాటు అరెస్టులు చేస్తున్నారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీమంత్రులు డీకే.అరుణ, మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని నిర్బంధించారు. మరికొంత మంది నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఛలో ట్యాంక్‌బండ్: రాజకీయ నేతల గృహ నిర్బంధం - tsrtc strike latest news
ఛలో ట్యాంక్‌బండ్‌కు మద్దతుగా బయలుదేరుతున్న రాజకీయ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీమంత్రులు డీకే.అరుణ, మోత్కుపల్లి నరసింహులును గృహ నిర్బంధం చేశారు.
ఛలో ట్యాంక్‌బండ్@రాజకీయ నేతల గృహ నిర్బంధం