తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ శుభవార్త.. పరీక్షలు రాసే విద్యార్థులకు బస్సు ప్రయాణం ఉచితం - ap upates

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్​ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి... ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఈడీ బ్రహ్మ నంద రెడ్డి తెలిపారు.

ఆర్టీసీ శుభవార్త.. పరీక్షలు రాసే విద్యార్థులకు బస్సు ప్రయాణం ఉచితం
ఆర్టీసీ శుభవార్త.. పరీక్షలు రాసే విద్యార్థులకు బస్సు ప్రయాణం ఉచితం

By

Published : Apr 22, 2022, 2:38 PM IST

పదోతరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ తీపికబురు అందించింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. విద్యార్థులు హాల్​టికెట్ చూపించి.. ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఈడీ పేర్కొన్నారు. గేట్ మీటింగ్​ల ద్వారా సిబ్బందికి తెలపాలని అధికారులకు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి సూచించారు. ఈ నెల 27 నుంచి మే 5 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.22 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

అరగంట ఆలస్యమైనా.. టెన్త్‌ పరీక్షకు ఓకే:పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక పరిస్థితుల్లో ఉదయం 10 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. విద్యార్థులు ఎవరైనా సహేతుకమైన కారణంతో ఆలస్యంగా వస్తే 10 గంటల వరకు అనుమతించాలని సూచించారు. ఈనెల 27 నుంచి పరీక్షలు మొదలుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం మంత్రి వర్చువల్‌గా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అన్ని పరీక్షా కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలన్నారు. ఏపీవ్యాప్తంగా 6,22,537 మంది పరీక్షలకు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ‘నాడు-నేడు’ కార్యక్రమం మొదటి విడతకు ప్రారంభోత్సవాలు, రెండో విడతకు శంకుస్థాపనలు వచ్చేనెల నుంచి చేయాలన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details