తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. సీఎం పదవిని కించపరుస్తూ కేసీఆర్ మాట్లాడడం.. హాలియా సభలో కాంగ్రెస్‌పై అసభ్య పదజాలం ఉపయోగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభలు మీరు మాత్రమే పెట్టుకోవచ్చా అని ప్రశ్నించారు.
సీఎం పదవి శాశ్వతం కాదు.. గుర్తుంచుకో: వీహెచ్ - telangana news
హాలియా బహిరంగసభలో కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నేత వి. హనుమంతరావు ఖండించారు. సీఎం పదవి శాశ్వతం కాదని... ప్రజల ఆలోచన మేరకే అధికారం ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
![సీఎం పదవి శాశ్వతం కాదు.. గుర్తుంచుకో: వీహెచ్ The remarks made by cm kcr against the Congress were condemn by V. Hanumantharao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10584729-191-10584729-1613044449054.jpg)
సీఎం పదవి శాశ్వతం కాదు.. గుర్తుంచుకో: వీహెచ్
ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని... ప్రజల ఆలోచన మేరకే అధికారం ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ వరాలు ప్రకటిస్తున్నారని.. మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని వీహెచ్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి:పురపాలిక, కార్పొరేషన్ల ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు