తెలంగాణ

telangana

ETV Bharat / city

"కొండను తవ్వి ఎలుకను పట్టారు" - disha updates today

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు కేసులకు తుదినివేదిక సమర్పించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం, దిశ కేసులో ప్రధాన నిందితులు చనిపోవడంతో.. దర్యాప్తు అవసరం లేదని పోలీసులు భావిస్తున్నట్లు  సమాచారం.

the-rat-dug-up-the-hill-wonderful
"కొండను తవ్వి ఎలుకను పట్టారు.. అద్భుతం"

By

Published : Dec 16, 2019, 5:03 AM IST

Updated : Dec 16, 2019, 5:49 AM IST

తహసిల్దార్‌ హత్య కేసు దర్యాప్తు పూర్తి
అబ్దుల్లాపూర్‌మెట్ తహసిల్దార్‌ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. నేరం జరిగినప్పుడు దాని పుట్టుపూర్వోత్తాలు విచారిస్తారు. కుట్రపన్నినవారు, సహకరించిన వారు, నేరానికి పాల్పడిన వారందరిపై అభియోగ పత్రాలు దాఖలు చేసి వారికి శిక్ష పడేలా చేస్తారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సురేష్ మరణించాడు. అయినప్పటికీ ఈ నేరం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు దాదాపు పూర్తిచేశారు. ఈ హత్య వెనుక ఇతర వ్యక్తులెవ్వరూ లేరని దర్యాప్తులో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.

"కొండను తవ్వి ఎలుకను పట్టారు.. అద్భుతం"

కేసు మూసేస్తాం..?
నిందితుడు మరణించినందున..ఇక ఘటన వెనుక ఎవ్వరూ లేరని నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులు న్యాయస్థానంలో యాక్షన్ ఎబెటెడ్‌గా పేర్కొంటూ తుది నివేదిక దాఖలు చేయనున్నారు. అనంతరం కేసు ఫిర్యాదుదారునికి నోటీసులు జారీ చేస్తారు. దర్యాప్తులో వెల్లడైన అంశాలను వివరిస్తారు. ఫిర్యాదుదారు విభేదిస్తే కేసు తెరిచి దర్యాప్తు కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశిస్తుంది. లేకుంటే తుది నివేదిక ఆధారంగా కేసు మూసివేస్తుంది.

దిశ కేసులో తుది నివేదిక పూర్తి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసుదీ ఇంచుమించు ఇదే పరిస్థితి. ప్రధాన నిందితులుగా భావించిన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్న కేశవులు పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించారు. అత్యాచారం జరిగినట్లు డీఎన్​ఏ నివేదిక స్పష్టం చేసింది. దిశను అపహరించి, అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం నిందితులెవ్వరూ జీవించి లేకపోవడం వల్ల దర్యాప్తు కొనసాగించడం అనవసరమనే భావన వ్యక్తమవుతోంది. ఈ కేసులోనూ పోలీసులు న్యాయస్థానంలో తుది నివేదిక దాఖలు చేయబోతున్నారు.

దర్యాప్తు అవసరం లేదట...?
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి పై పట్టపగలే పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో గాయపడ్డ నిందితుడు సురేష్ చికిత్స పొందుతూ ఉస్మానియా ఆస్పత్రిలో మరణించాడు. దిశ అత్యాచారం, హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొన్న నలుగురు నిందితులూ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దీంతో దర్యాప్తు అవసరం లేదని పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: 'దిశ' నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్

Last Updated : Dec 16, 2019, 5:49 AM IST

ABOUT THE AUTHOR

...view details