Lashkar Bonalu:సికింద్రాబాద్ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆదివారం తెలవారుజామునుంచే అమ్మవారిని దర్శించుకున్న భక్తులు... బోనాలు, ఒడిబియ్యం, సారె, సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెల్లవారు జామున 4 గంటలకే అమ్మవారికి తొలి బోనం సమర్పించగా... ఎమ్మెల్సీ కవిత 2000 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టమైన రంగం ఇవాళ జరగనుంది. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించి... అమ్మవారు భవిష్యవాణి పలకనుంది. ఈ కార్యక్రమాన్నే రంగం అంటారు. రంగంలో అమ్మపలికే వాక్కు నిజమవుతుందని భక్తుల విశ్వాసం. భవిష్యవాణి అనంతరం అమ్మవారి... అంబారి ఊరేగింపు వైభవంగా సాగనుంది. అంబారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో... అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.