తెలంగాణ

telangana

ETV Bharat / city

IMD: విపత్తు వేళ రాడార్‌ పడక.. తెలిసేదెలా వాన రాక? - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంలోని పడకేసిన రాడార్‌ డాఫ్లర్‌

IMD: అసలే వర్షాకాలం... ఏ క్షణంలో ఎక్కడ కారుమేఘాలు కమ్ముకొస్తాయో.. ఏయే ప్రాంతాల్లో కుండపోత వరదలు వస్తాయో తెలియదు. అత్యంత కీలకమైన ఈ సమాచారాన్ని ముందుగా ప్రజలకు చేరవేసి వారి పంటలు, ప్రాణాలు కాపాడాల్సిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంలోని రాడార్‌ డాఫ్లర్‌ పడకేసింది.

Radar Daffler
Radar Daffler

By

Published : Jul 10, 2022, 9:48 AM IST

IMD: నిండు వర్షాకాలం... ఏ క్షణంలో ఎక్కడ కారుమేఘాలు కమ్ముకొస్తాయో.. కుండపోతతో ఏయే ప్రాంతాల్లో వరదలు వస్తాయో తెలియదు. అత్యంత కీలకమైన ఈ సమాచారాన్ని ముందుగా ప్రజలకు చేరవేసి వారి పంటలు, ప్రాణాలు కాపాడాల్సిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంలోని రాడార్‌ డాఫ్లర్‌ పడకేసింది. వాతావరణశాఖ దిల్లీ నుంచి ఇంజినీర్లను పంపి మరమ్మతులు చేయిస్తున్నా పరిస్థితిలో మార్పులేదు. మచిలీపట్నం, విశాఖ, నాగ్‌పుర్‌ రాడార్ల పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం దాదాపుగా వస్తున్నందున వాటి నుంచి సూచనలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రాష్ట్ర సంచాలకురాలు డా.నాగరత్న తెలిపారు. డాఫ్లర్‌ మరమ్మతు చేయించాలని దిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చామని వివరించారు. ఉపగ్రహాలిచ్చే చిత్రాల ఆధారంగానూ వాతావరణ సూచనలు ఇవ్వవచ్చని, ప్రస్తుతం వాటిని వినియోగించుకుంటున్నామని చెప్పారు.

ఆ ప్రచారంలో నిజం లేదు...సూర్యుడి చుట్టూ భూగ్రహం తిరిగే అంశంలో వచ్చే నెల(2022 ఆగస్టు)లో సౌరతరంగాల వల్ల వాతావరణం మారిపోయి గతేడాదికన్నా చాలా చల్లగా ఉంటుందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల్లో కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని డాక్టర్‌ నాగరత్న చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details