తెలంగాణ

telangana

ETV Bharat / city

రాత్రంతా నాలాలోనే ఉన్న వ్యక్తిని కాపాడిన పోలీసులు - సికింద్రాబాద్ బోయిన్​పల్లి వార్తలు

ప్రమాదవశాత్తు నాలాలో పడిన ఓ వ్యక్తి పైకి రాలేకపోయాడు. అపస్మారక స్థితిలో రాత్రంతా అందులోనే గడిపాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అతణ్ని పోలీసులు కాపాడారు. ఈ ఘటన బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

the-police-rescued-the-man-who-had-been-in-drainage-in-all-night-in-bowenpally
రాత్రంతా నాలాలోనే ఉన్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

By

Published : Feb 22, 2021, 1:34 PM IST

ఉప్పల్ రామాంతపూర్​కు చెందిన లక్ష్మణ్ శనివారం రాత్రి బాలంరాయి, తాడ్​బంద్ నాలాపై నడుస్తూ.. అందులో పడిపోయాడు. రాత్రంతా నాలాలోనే ఉన్న ఆ వ్యక్తి పైకి రాలేక అవస్థలు పడ్డాడు. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 100కు ఫోన్​ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బోయిన్​పల్లి వినయ్ కుమార్, అహ్మద్ పాషా వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడిని కాపాడారు. శరీరంపై పేరుకుపోయిన మురికిని శుభ్రం చేసి.. బట్టలు మార్పించారు. వివరాలు తెలుసుకుని ఇంటికి పంపించారు.

నాలాలో పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

ఇదీ చూడండి:వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు

ABOUT THE AUTHOR

...view details