TS police have filed a criminal charge sheet former CI Nageshwar Rao : వనస్థలిపురం పోలీసులు మాజీ సీఐ నాగేశ్వర్ రావు కేసులో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. 600 పేజీలతో కూడిన నేరాభియోగపత్రంలో 75 మంది సాక్ష్యులను చేర్చారు. వీటిని ఎల్బీ నగర్ కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. మాజీ సీఐ నాగేశ్వర్రావు నేరం చేశారనడానికి తగిన ఆధారాలను పొందుపర్చారు. జూలై 7వ తేదీన వనస్థలిపురం పీఎస్ లో నాగేశ్వర్ రావుపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు... అపహరించారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూలై11వ తేదీన నాగేశ్వర్రావును అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత 18వ తేదీన కస్టడీలోకి తీసుకొని 5రోజుల పాటు విచారించారు. నాగేశ్వర్రావు అత్యాచారం చేశారనడానికి తగిన ఆధారాలు సేకరించారు. మహిళ లోదస్తుల్లో నమూనాలు సేకరించి, నాగేశ్వర్ రావు డీఎన్ఏతో సరిపోల్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఈ రెండు సరిపోలాయి.