తెలంగాణ

telangana

ETV Bharat / city

ఫోన్​ మోగిందా.. సొమ్ము గోవింద..! - తెలంగాణలో సైబర్ నేరాలు

రాష్ట్రంలో సైబర్ నేరాలకు హద్దు అదుపులేకుండా పోయింది. రోజుకో పద్ధతిలో మోసగాళ్లు నేరాలు చేస్తున్నారు. నిరక్ష్యరాస్యులు సహా చదువుకున్న వారిని సులభంగా బోల్తా కొట్టిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్ నేరాలు ఎక్కువగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో బాధితులు ఎక్కువగా ఉన్నారని ఐటీ నిపుణులు వెల్లడిస్తున్నారు.

the-phone-rang-money-govinda
ఫోన్​ మోగిందా.. సొమ్ము గోవింద..!

By

Published : Dec 26, 2019, 6:06 AM IST

Updated : Dec 26, 2019, 7:24 AM IST

ఫోన్​ మోగిందా.. సొమ్ము గోవింద..!

భాగ్యనగర వాసులు సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. మోసగాళ్ల మాటలు నమ్మి నట్టేటమునుగుతున్నారు. బ్యాంకుఖాతా రహస్య వివరాలు చెప్పినగదును పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాలు జరిగే తీరును వివరిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, బ్యాంకర్లు ఎన్ని సూచనలు చేస్తున్నా ఫలితం కనిపించడంలేదు. గ్రామీణప్రాంతాలతో పోలిస్తే రాజధానివాసులే సైబర్ నేరాల భారీనపడటం కలవరానికి గురిచేస్తోంది.

జంట నగరాలు - సైబర్‌ నేరాలు

  1. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది 2100కు పైగా సైబర్‌ కేసులు నమోదయ్యాయి.
  2. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో బెంగళూరు తర్వాతి స్థానం భాగ్యనగరానిదే కావడం ఆందోళన కలిగిస్తోంది.
  3. 2016లో మూడు కమిషనరేట్ల పరిధిలో కేవలం 515 కేసులు మాత్రమే నమోదు కాగా.. 2017లో 1313, 2018లో 953 కేసులయ్యాయి.
  4. ఈ ఏడాది చివర్లో సైబర్ నేరస్థులు రెచ్చిపోయారు. నవంబర్ వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో 1818 కేసులునమోదు కాగా డిసెంబర్‌ 24 వరకు ఏకంగా 315 కేసులు నమోదయ్యాయి.

ఓఎల్​ఎక్స్​తో బీ కేర్​ ఫుల్​
సైబర్​ నేరాల్లో ఎక్కువగా ఓఎల్​ఎక్స్​, ఓటీపీ మోసాలు జరుగుతున్నట్లు సైబర్ క్రైం విభాగం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓఎల్​ఎక్స్ వెబ్‌సైట్‌లో పాతకార్లు, బైక్‌లు విక్రయానికి పెట్టినట్లు ప్రకటనలు ఇవ్వడం వాటిని నమ్మి ఫోన్లు చేసే వినియోగదారుల ఖాతా, వ్యాలెట్ల వివరాలు తెలుసుకొని అందులోని సొమ్ము కాజేస్తున్నారు.

సైబర్​ నేరం @ నయా ట్రెండ్​
రాజస్థాన్‌ భరత్‌పూర్‌కు చెందిన ముఠాలు ఈ తరహా మోసాలు ఎక్కువ చేస్తున్నాయి. బ్యాంకు అధికారులమని నమ్మించి ఖాతా వివరాలు తెలుసుకొని ఆ తర్వాత చరవాణికివచ్చే ఓటీపీ ద్వారా నగదు కొల్లగొడుతున్నారు. జార్ఖండ్‌లోని జామ్‌తారా ప్రాంతానికి చెందిన మోసగాళ్లు ఈ తరహా నేరాలు ఎక్కువగా చేస్తున్నారు.

అపరిచితులను నమ్మకండి..!
తొలుత నైజీరియన్లే సైబర్‌ నేరాలకు పాల్పడగా..... ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకుఖాతాకు చెందిన వివరాలను అపరిచితులకు చెప్పొద్దని సైబర్ క్రైం పోలీసులు, బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అలాంటివి అడిగితే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: థానేదర్‌ సింగ్​ కుష్వా... ఓ తెలివైన దొంగ..!

Last Updated : Dec 26, 2019, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details