ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు పూర్తి భరోసా వచ్చిందని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత వాసులను అవమానించిన చంద్రబాబుకు జనం తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
ప్రయోజనం లేదు..
ఉద్యమం లేకపోయినా కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇంకో ప్రాంతాన్ని మోసం చేసేందుకు బాబు ప్రయత్నించారని ఆరోపించారు. విజయవాడ, గుంటూరు ప్రజలను ఆయన రెచ్చగొట్టినా ప్రయోజనం లేదన్నారు. ఆ ప్రాంతం వాళ్లు తమ రోషాన్ని చూపించి అతన్ని ఓడించారని సజ్జల విమర్శించారు. లేని సమస్యలు సృష్టిస్తూ.. జనాన్ని మోసం చేశారని మండిపడ్డారు.