తెలంగాణ

telangana

ETV Bharat / city

నెల రోజుల్లో 100 రెట్లు పెరిగిన పాజిటివ్ కేసులు..! - ఏపీలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకీ వైరస్ తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. కేవలం 30 రోజుల్లోనే పాజిటివ్ కేసులు 100 రెట్లు పెరిగాయి.

corona updates in ap
నెల రోజుల్లో 100 రెట్లు పెరిగిన పాజిటివ్ కేసులు..!

By

Published : Apr 26, 2020, 6:37 AM IST

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు నెలలో 100 రెట్లకుపైగా పెరిగాయి. మార్చి 25 నాటికి 10 కరోనా కేసులుండగా, ఏప్రిల్ 25 నాటికి ఆ సంఖ్య 1016కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్​సైట్ covid19india.orgలో వెల్లడించిన వివరాల ప్రకారం... మార్చి 25 నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 657. వాటిలో ఏపీలోనివి 1.52 శాతం. ఏప్రిల్ 25 నాటికి దేశంలో నమోదైన కేసులు 25,313. వాటిలో ఏపీవి 4.01 శాతం

ప్రతి 10 రోజులకూ పెరుగుతున్న తీరు ఇలా

తేదీ కేసుల సంఖ్య పెరుగుదల
మార్చి 15 1 --
మార్చి 24 8 7
ఏప్రిల్ 3 164 156
ఏప్రిల్ 13 439 275
ఏప్రిల్ 23 893 454
ఏప్రిల్ 25 1,016 123

ABOUT THE AUTHOR

...view details