Indian Students in Foreign Countries : ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. వారు వెళ్లే దేశాల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో మన విద్యార్థులు వివిధ రకాల కోర్సులను అభ్యసిస్తున్నారు. అంటే దాదాపు సగం దేశాలకు మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం వెళ్తున్నారన్న మాట. మొత్తంగా అన్ని దేశాల్లో కలిపి 11.33 లక్షల మంది విద్యార్థులున్నట్టు, వారిలో 80-85 శాతం మంది పీజీ విద్యకే వెళ్లినట్టు విదేశాంగశాఖలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి.
Indian Students in Foreign Countries : 99 దేశాల్లో భారతీయ విద్యార్థులే - 99 విదేశాల్లో భారతీయ విద్యార్థులు
Indian Students in Foreign Countries : ప్రపంచ వ్యాప్తంగా 99 దేశాల్లో భారతీయ విద్యార్థులు వివిధ రకాల కోర్సులను అభ్యసిస్తున్నట్లు విదేశాంగ శాఖలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా యూఏఈ, కెనడా, అమెరికా దేశాలకు వెళ్తున్నట్లు పేర్కొంటున్నాయి.
![Indian Students in Foreign Countries : 99 దేశాల్లో భారతీయ విద్యార్థులే Indian Students in Foreign Countries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14642070-thumbnail-3x2-a.jpg)
ముఖ్యంగా చైనా, జర్మనీ, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, కిర్గిస్థాన్, కజికిస్థాన్ దేశాలకు వైద్య విద్య కోసమే వెళ్తున్నట్టు, ఉక్రెయిన్‌కు వెళ్లిన 18 వేల మందిలో ఎక్కువమంది వైద్య విద్య అభ్యసిస్తున్నట్టు ఆ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఎక్కువగా కెనడాలో 2.15 లక్షల మంది, అమెరికాలో 2.12 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2.19 లక్షల మంది ఉన్నప్పటికీ, వారిలో ఎక్కువ భాగం తమ కుటుంబాలు స్థిరపడిన కారణంగా వెళ్లిన వారేనని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. విదేశీ విద్యకు వెళ్లే వారిలో చదువు పూర్తయిన తర్వాత భారత్‌కు వచ్చేవారి శాతం అతి స్వల్పమేనని, ఎక్కువ మంది ఆయా దేశాల్లోనే స్థిరపడుతున్నారని వారు పేర్కొంటున్నారు.
- ఇదీ చదవండి :ఉక్రెయిన్-రష్యా మధ్య మూడోసారి చర్చలు!