ఏపీలో 473కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య - కరోనా
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 473కి చేరుకుంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇవాళ ఉదయం 9వరకు 34 మందికి వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధరించారు. కరోనా కారణంగా కొత్తగా మరో ఇద్దరు మృతి చెందగా... ఇప్పటిదాకా 9 మంది మరణించారు. వైరస్ నుంచి కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో... గుంటూరు జిల్లాలో 16 నమోదవగా... అక్కడి మొత్తం సంఖ్య 109కి చేరుకుంది. కృష్ణా జిల్లాలో 8కొత్త కేసులు వెలుగుచూడటంతో... మొత్తం బాధితుల సంఖ్య 44కు చేరుకుంది. కర్నూలు జిల్లాలో 7 కరోనా కేసులు నమోదవగా... మొత్తం సంఖ్య 91కి చేరుకుంది.అనంతపురం జిల్లాలో ఇద్దరికి కొత్తగా వైరస్ సోకగా... బాధితుల సంఖ్య 17కు చేరుకుంది. నెల్లూరు జిల్లాలో ఒకరికి కొత్తగా కరోనా సోకినట్టు వైద్యాధికారులు నిర్ధరించారు.
carona positive cases increases in Andhra pradesh latest news
.