తెలంగాణ

telangana

కడసారి చూపు దక్కకుండా చేస్తున్న కరోనా...

By

Published : Aug 1, 2020, 7:30 AM IST

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఊరూవాడా తిరిగిన ఆ వ్యక్తే చివరకు మహమ్మారి బారిన పడ్డారు. తాను ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుంటే.. కరోనాకు బలైన తల్లి (80) అంతిమ సంస్కారాలకు దూరమయ్యారు.

corona death
కడసారి చూపు దక్కకుండా చేస్తున్న కరోనా...

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఓ వ్యక్తి రియల్స్‌ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి హోదాలో రెండు నెలలుగా కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చిత్తూరు జిల్లావ్యాప్తంగా పర్యటించారు. తిరుపతి, నగరి, శ్రీకాళహస్తి, పాకాల ప్రాంతాల్లో కరపత్రాలు పంచారు. సుమారు రెండు వేల కేసుల యాపిల్‌ జ్యూస్‌ పేదలకు అందించారు. ఈ క్రమంలో కరోనా బారినపడి జులై 22న స్విమ్స్‌లో చేరారు.

ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని ద్వారా వైరస్‌ బారినపడిన తల్లిని జులై 25న స్విమ్స్‌లో చేర్పించగా ఆమె శుక్రవారం ఉదయం మృతిచెందారు. ఆ సామాజిక కార్యకర్త భార్య, పిల్లలు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తల్లి మరణవార్త అతనికి తెలియకపోవడమే కాకుండా చివరిచూపుకూ నోచుకోలేదు. వృద్ధురాలి అంత్యక్రియలు సాయంత్రం గోవిందధామంలో పూర్తిచేసినట్లు బంధువు సాకం నాగరాజు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details