తెలంగాణ

telangana

ETV Bharat / city

B pharmacy students surgery: అలా చేస్తామని.. మర్మాంగాన్ని కోసేసి.. - hijra died in nellore district

B pharmacy students surgery: ఓ యువకుడిని హిజ్రాగా మార్చేందుకు బీ ఫార్మసీ విద్యార్థులు శస్త్రచికిత్స చేశారు. అతని మర్మాంగాన్ని తొలగించడంతో.. తీవ్ర రక్తస్రావమై ఆ యువకుడు మృతి చెందారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది.

b pharmacy students operation
b pharmacy students operation

By

Published : Feb 26, 2022, 6:50 AM IST

B pharmacy students surgery:వారు చదివేది ఫార్మసీ.. అయినా డాక్టర్లలాగా సర్జరీ చేస్తామన్నారు. చిన్నాచితకా సర్జరీ కాదు.. ఓ యువకుడిని హిజ్రాగా మారుస్తామని నిపుణుల్లా అభయమిచ్చారు. లింగ మార్పిడి చేసేందుకు కత్తి పట్టి శస్త్ర చికిత్స కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి మర్మాంగాన్ని తొలగించారు. దీంతో.. తీవ్ర రక్తస్రావమై ఆ యువకుడు చివరికి మృతి చెందాడు. ఏపీలో ఈ ఘటన జరగ్గా.. నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బీఫార్మసీ విద్యార్థులు ఈ శస్త్రచికిత్స చేశారు.

తక్కువ ఖర్చుతో చేస్తానని..

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్‌ అలియాస్‌ అమూల్య(28)కు పెళ్లయింది. 6 నెలలకే భార్య విడిచి వెళ్లింది. నాలుగేళ్ల కిందట శ్రీకాంత్‌ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఒంగోలులో ఉండేవారు. అక్కడ ఆయనకు విశాఖకు చెందిన మోనాలిసా అలియాస్‌ అశోక్‌తో పరిచయమైంది. ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆరు నెలల కిందట శ్రీకాంత్‌, మోనాలిసాలకు ఓ యాప్‌ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎ.మస్తాన్‌, జీవ పరిచయమయ్యారు. సాన్నిహిత్యం పెరిగాక తాను ముంబయికి వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటానని మస్తాన్‌కు శ్రీకాంత్‌ చెప్పారు. అందుకు లక్షలు ఖర్చవుతాయన్న మస్తాన్​.. తాను బీఫార్మసీ విద్యార్థినేనని శస్త్రచికిత్సపై అవగాహన ఉందని చెప్పాడు. తక్కువ ఖర్చుతో తానే ఆపరేషన్​ చేస్తానని మస్తాన్‌ హామి ఇచ్చాడు.

లాడ్జీలో శస్త్రచికిత్స

అందరూ కలిసి 23వ తేదీన నెల్లూరులోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నారు. మస్తాన్‌, జీవా.. మోనాలిసా సాయంతో శ్రీకాంత్‌కు గురువారం శస్త్రచికిత్స ప్రారంభించారు. మర్మాంగాన్ని తొలగించడంతో తీవ్ర రక్తస్రావమైంది. పల్స్‌ పడిపోవడం, మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే బాధితుడు మృతిచెందాడు.

చనిపోయాడని తెలిసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయాన్ని గుర్తించిన లాడ్జీ సిబ్బంది చిన్నబజారు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు.

ఇదీ చదవండి:Illegal Affair: గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే..

ABOUT THE AUTHOR

...view details