హైదరాబాద్ నగరంలో మధ్యప్రదేశ్‌కు చెందిన వారు గత 20 ఏళ్ల నుంచి వివిధ కార్యక్రమాలకు వీధుల్లో ఒంటెలను తిప్పుతూ జీవనం సాగించేవారు. లాక్డౌన్ వేళ 40కి పైగా కుటుంబాలకు ఆకలి తిప్పలు తప్పడం లేదు. తమకు స్థానికంగా ఓటరు గుర్తింపు, ఆధార్ కార్డులు ఉన్నా రేషన్ కార్డులు లేవని ప్రభుత్వం అందించే బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లాక్డౌన్ వేళ జీవనాధారం ఎడారిమయం - lockedown time Hyderabad Migrant laborers suffer
లాక్డౌన్ సమయంలో వలస కూలీలు పలుచోట్ల చిక్కుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన సుమారు 40కి పైగా కుటుంబాలు తమకు ఎలాంటి సాయం అందడం లేదని వాపోతున్నారు. స్థానికంగా ఓటరు గుర్తింపు, ఆధార్ కార్డులు ఉన్నా రేషన్ కార్డులు లేవని ప్రభుత్వం అందించే బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
![లాక్డౌన్ వేళ జీవనాధారం ఎడారిమయం the-lifeblood-of-the-desert-in-lockdown-time in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6825337-276-6825337-1587102854060.jpg)
లాక్డౌన్ వేళ జీవనాధారం ఎడారి మయం
ఇంతవరకు తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదన్నారు. తమను అదుకోవాలని కోరుతున్నారు. తమ వెంట ఉన్న ఒంటెల ఆహారం కోసం బయట ప్రాంతాల్లో ఆకుల సేకరణ కూడా కష్టతరంగా మారిందని చెబుతున్నారు.
ఇదీ చూడండి :మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త