sri krishna janmastami: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏపీలోని నెల్లూరుకు చెందిన "ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్" వారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్ఠతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ఈ వేడుకలను ఆగస్టు 1 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడు ఖండాల్లోని 80 దేశాలకు చెందిన ప్రజలు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు.
ఈ వేడుకల్లో భాగంగా.. 50 కంటే ఎక్కువ ఈవెంట్లు నిర్వహిస్తున్నామని, ఇందులో 300 కంటే ఎక్కువ సబ్ కేటగీరిలు ఉన్నాయని చెప్పారు. ఈ పోటీలలో నాలుగు నెలల పిల్లల నుంచీ.. 80 ఏళ్ల వయసుకున్న వారి వరకు పాల్గొనవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే వారు చేయాల్సిన పని ఏమంటే.. తమకు నచ్చిన ఏదైనా అంశంపై వీడియో రూపొందించి ఆన్లైన్ ద్వారా పంపించాలి.