తెలంగాణ

telangana

ETV Bharat / city

'సినిమాకు ప్రేరణగా నిరుపేద అమ్మాయి జీవిత కథ' - సాచి చిత్రం

Bindupriya Biopic: బయోపిక్స్ అంటే గుర్తొచ్చేది పెద్ద పెద్ద నాయకులు, క్రీడాకారులు... లేదంటే సామాన్యుల్లో అసమాన్యంగా జీవించిన వారి గాథలే. కానీ తండ్రి చాటు బిడ్డగా పెరిగిన ఓ నిరుపేద అమ్మాయి జీవిత గాథ సినిమా కథకు ప్రేరణగా నిలిచిదంటే అతిశయోక్తి కాదు. తండ్రి చావు బతుకుల్లో ఉండగా... కుటుంబానికి అండగా నిలవాలని కులవృత్తిని చేపట్టి కొడుకు లేని లోటును తీర్చింది. ఆ అమ్మాయి జీవిత గాథను అమెరికా వాసి సినిమాగాను రూపొందిస్తున్నారు. ఇంతకీ ఎవరూ ఆ అమ్మాయి? ఏం చేస్తుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

bindhu priya
బిందుప్రియ

By

Published : Jul 5, 2022, 3:06 PM IST

Updated : Jul 5, 2022, 3:14 PM IST

సినిమాకు ప్రేరణగా నిరుపేద అమ్మాయి జీవిత కథ

Bindupriya Biopic: సాధారణంగా బయోపిక్స్ అంటే గుర్తొచ్చేది పెద్ద పెద్ద నాయకులు, క్రీడాకారులు... లేదంటే సామాన్యుల్లో అసమాన్యంగా జీవించిన వారి గాథలే. కానీ తండ్రి చాటు బిడ్డగా పెరిగిన ఓ నిరుపేద అమ్మాయి జీవిత గాథ సినిమా కథకు ప్రేరణగా నిలిచిదంటే అతిశయోక్తి కాదు. తండ్రి చావు బతుకుల్లో ఉండగా.... కుటుంబానికి అండగా నిలవాలని కులవృత్తిని చేపట్టి కొడుకు లేని లోటును తీర్చింది. ఆ అమ్మాయి జీవిత గాథను గుర్తించిన అమెరికా వాసి "సాచి" పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు. చిన్న వయసులోనే నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆ యువతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బిందుప్రియ.

అశ్వారావుపేట మండలం మొండికుంటలో జన్మించిన ఈ అమ్మాయే బిందు ప్రియ. ఇంట్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చిన్నదైన బిందు. నాయిబ్రహ్మాణుడు అయిన తండ్రి ఆసుపత్రిలో ఉండగా కులవృత్తి అయిన క్షవరం పనిని చేపట్టి ఇంటికి పెద్దదిక్కై కుటుంబాన్ని పోషించుకుంది. ఆస్పత్రిలో తండ్రికి అండగా తల్లి ఉంటే... సెలూన్ నిర్వహణ బాధ్యతలు బిందు చూసుకునేది. సెలూన్‌కు వచ్చే వాళ్లంతా హేళనగా మాట్లాడినా సహించేది. ఓ పూట పాఠశాలకు వెళ్తూ మరో పూట సెలూన్‌లో పనిచేయడంతో కుటుంబ అవసరాలు తీరేవని తెలిపింది. తాను తప్పు చేయడం లేదని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో... ఏడాదిన్నర పాటు పనిచేసింది. ఆ తర్వాత తండ్రి పూర్తి స్థాయిలో కోలుకొవడంతో ఇక చదువుపై దృష్టి సారించింది బిందు.

పురుషులే చేయాల్సిన క్షవరం పనిని అమ్మాయైన బిందుప్రియ చేయడం పట్ల మొదట్లో అనేక విమర్శలు ఎదురయ్యాయి. అనంతరం కుటుంబ పరిస్థితిని తెలుసుకొని చాలా మంది అభినందించినట్లు బిందుప్రియ చెబుతోంది. మారుమూల గ్రామంలో పుట్టిన తన జీవితాన్ని సినిమా తీయడం సంతోషంగా ఉందని బిందు అంటోంది. రోజూ మధ్యాహ్నం తండ్రికి భోజనం తీసుకొచ్చే బిందుప్రియ. ఆ సమయంలో కాసేపు తండ్రి చేసే పనిని పరిశీలించేది. ఆడపిల్లకు ఈ పని నేర్పిస్తే నలుగురు ఏమనుకుంటారోనని ఆలోచించలేదు బిందు తండ్రి రాజేశ్. నెమ్మదిగా క్షవరం చేయడం నేర్పించాడు. కానీ కష్ట కాలంలో ఆ పనే తమ కుటుంబాన్ని కాపాడుతుందని ఊహించలేదని అంటున్నాడు రాజేశ్‌.

అలా... బిందుప్రియ పని చేస్తున్న వీడియో యూట్యూబ్ ద్వారా విదేశాల్లోనూ వైరలయ్యింది. అది చూసిన ఎన్ఆర్​ఐ వివేక్ పోతినే బిందుప్రియ జీవితం ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుందనుకున్నారు. దర్శకుడు కావాలనుకున్న తన లక్ష్యాన్ని బిందుప్రియ కథతో మొదలుపెట్టాలని నిర్ణయించుకొని కథ మొత్తం సిద్ధం చేశాడు. ఆ తర్వాత ఇండియా తిరిగొచ్చిన వివేక్‌ ఓ క్యాబ్ డ్రైవర్ సహాయంతో బిందుప్రియ గ్రామానికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నాడు. అనంతరం తన మిత్రుడు ఉపేందర్ సహకారంతో విదాత ప్రొడక్షన్స్ పతాకంపై సాచి పేరుతో సినిమాను తెరకెక్కించడం ఆరంభించారు.

ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న బిందు ప్రియ... ఐపీఎస్ అధికారి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ దిశగా చదువు సాగిస్తూ సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడల్లా తండ్రికి కొడుకులా సహాయపడుతూ ఆదర్శంగా నిలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 5, 2022, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details