తెలంగాణ

telangana

ETV Bharat / city

'అవి ఎక్కువగా ఉన్నవాళ్లలోనే కొవిడ్‌ సమస్య తీవ్రం ' - హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక

'మగవాళ్లు సామాజిక దూరం పాటించరు. మాస్కు ధరించరు. పబ్లిక్‌ ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతుంటారు. ఆ నిర్లక్ష్యం వల్లే వారికి కరోనా ఎక్కువగా వస్తోందని' పరిశోధకులు మొదట్లో భావించారు. అయితే తరవాత క్షుణ్ణంగా పరిశీలించగా.. పురుషుల ఊపిరితిత్తుల కింది భాగంలో ఉండే రిసెప్టర్లు అధికంగా ఉన్నాయంటోంది హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌. ఇంతకీ పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

The Houston Methodist Research Institute reports that men are more likely to suffer from covid than women
'అవి ఎక్కువగా ఉన్నవాళ్లలోనే కొవిడ్‌ సమస్య తీవ్రం '

By

Published : Jan 31, 2021, 12:55 PM IST

ఆడవాళ్లతో పోలిస్తే కొవిడ్‌ వల్ల మగవాళ్లే ఎక్కువ బాధపడుతున్నట్లు హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంటోంది. ఇందుకోసం వీళ్లు దాదాపు లక్ష కేసుల్ని విశ్లేషించగా.. వైరస్‌ పాజిటివ్‌ వచ్చి ఇంటెన్సివ్‌ కేర్‌లో చేరి చికిత్స తీసుకున్నవాళ్లలో అత్యధికులు మగవాళ్లేనట. ప్రదేశం, సంస్కృతి, సంప్రదాయంతో సంబంధం లేకుండా విభిన్న దేశాలను పరిశీలించినప్పుడు.. మగవాళ్లే ఎక్కువగా దీని బారినపడినట్లు తేలింది.

మగవాళ్లు సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కు ధరించకపోవడం, పబ్లిక్‌ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగడమే కారణం అని మొదట్లో భావించారు. తరవాత క్షుణ్ణంగా పరిశీలించగా.. పురుషుల ఊపిరితిత్తుల కింది భాగంలో ఏసీఈ2 రిసెప్టర్లు అధికంగా ఉన్నాయని.. అవి ఎక్కువగా ఉన్నవాళ్లలోనే కొవిడ్‌ సమస్య తీవ్రంగా ఉందని గుర్తించారు. అంటే కొన్ని అనారోగ్య సమస్యలకి పుట్టుకతో వచ్చిన శరీర నిర్మాణమే కారణం అంటున్నారు పరిశోధకులు.

ఇదీ చూడండి:పోషకాల పల్లీలు... చాలా టేస్ట్ గురూ!

ABOUT THE AUTHOR

...view details