తెలంగాణ

telangana

ETV Bharat / city

Ts High Court: వివిధ అంశాలపై అందిన లేఖలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు - తెలంగాణ హైకోర్టు వార్తలు

High Court accepted as public interest litigation: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేక.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బాలల హక్కుల సంఘం రాసిన లేఖను.. హైకోర్టు సుమోటో(Sumoto), పిల్‌గా పరిగణించింది. నల్గొండ జిల్లా మర్రిగూడ జిల్లా పరిషత్ పాఠశాల పదోతరగతి విద్యార్థి లేఖపై ఉన్నత న్యాయస్థానం స్పందించింది.

Ts High Court
Ts High Court

By

Published : Feb 9, 2022, 1:59 AM IST

Ts High Court on letters received: వివిధ అంశాలపై అందిన లేఖలను... హైకోర్టు సుమోటో(Sumoto), ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించి విచారణకు స్వీకరించింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేక.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బాలల హక్కుల సంఘం రాసిన లేఖను.. పిల్‌గా పరిగణించింది.

బడి పక్కన శ్మశాన వాటిక వల్ల చదువులకు అంతరాయం కలుగుతోందంటూ.. నల్గొండ జిల్లా మర్రిగూడ జిల్లా పరిషత్ పాఠశాల పదోతరగతి విద్యార్థి ఎస్.కార్తీక్ లేఖపై ఉన్నత న్యాయస్థానం స్పందించింది. శ్మశానాన్ని మరోచోటకు తరలించాలని లేఖలో విద్యార్థి కోరారు.

ములుగు జిల్లా నూగూరు వెంకటాపూర్ లో జిల్లా పరిషత్ పాఠశాల భవనం దుస్థితిపై... న్యాయవాది పిట్ట శ్రీనివాస్ రెడ్డి లేఖను విచారణకు స్వీకరించింది. నల్గొండ జిల్లా నిడమనూరులో రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా... ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారంటూ న్యాయవాది ఎం.వెంకట్ రెడ్డి రాసిన లేఖను కూడా విచారణకు స్వీకరించింది. 4 వేర్వేరు అంశాలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని... ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

ఇదీ చూడండి:TS Drugs Control Wings: పోలీస్​ శాఖలో డ్రగ్స్​ కంట్రోల్​ వింగ్స్​ ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details