తెలుగుదేశం మహిళా నేత గౌతు శిరీషకు సీఐడీ నోటీసుపై.. ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేశారంటూ గతంలో సీఐడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. ఈనెల 20న మరోసారి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. ఈ నోటీసులు కొట్టివేయాలంటూ హైకోర్టులో గౌతు శిరీష పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీ నోటీసులపై స్టే విధించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
అందుకే 12మందిపై కేసులు: ఏపీ సీఐడీ
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన 12మందిపై కేసులు నమోదు చేశామని ఏపీ సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అధికార ముద్రను ఉపయోగించి.. ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేసేలా ఉన్న నకిలీ ప్రెస్‌నోట్‌ను వీరంతా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారని పేర్కొంది. ఇప్పటివరకూ నలుగుర్ని విచారించామని తెలిపింది. గౌతు శిరీషకు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చి విచారణకు పిలిపించామని చెప్పింది.
ఇదీ చదవండి:'డైరెక్టర్‌తో సమస్యలు పరిష్కారం కావు.. కేసీఆర్ రావాల్సిందే'
బుల్డోజర్లతో కూల్చివేతలు ఆపలేం.. కానీ...: సుప్రీంకోర్టు