తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా పరిస్థితిపై హైకోర్టులో నేడు అత్యవసర విచారణ - తెలంగాణలో కొవిడ్​ ప్రభావం

telangana High Court
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

By

Published : May 10, 2021, 9:28 PM IST

Updated : May 11, 2021, 12:06 AM IST

21:27 May 10

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

   రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. ఈనెల 5న విచారణ జరిపిన హైకోర్టు.. పలు ఉత్తర్వులు జారీ చేసింది. వారాంతపు లాక్​డౌన్ లేదా కర్ఫ్యూ వేళలు పొడిగించాలని సూచించడంతో పాటు.. కరోనా పరీక్షలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు, నియంత్రణ చర్యలపై పలు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 13న చేపట్టనున్నట్లు ఈనెల 5న హైకోర్టు తెలిపింది. 

   అయితే పెరుగుతున్న తీవ్రత, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇవాళే విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరపనుంది.

ఇవీచూడండి:లాక్​డౌన్​పై రేపు సీఎం కీలక నిర్ణయం

Last Updated : May 11, 2021, 12:06 AM IST

ABOUT THE AUTHOR

...view details