తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆర్ఆర్ఆర్'​ విడుదల నిలిపివేయాలన్న పిటిషన్​పై హైకోర్టు తీర్పు - రాజమౌళి తాజా అప్డేట్

PIL dismissed on RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమాతో అల్లూరి సీతారామరాజు, కుమురంభీంల పేరు, ప్రతిష్ఠలకు భంగం కలగదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విషం సోక్రటీస్​ను చంపుతుంది కానీ.. ఆయన సాహిత్యాన్ని కాదని వ్యాఖ్యానించింది.

PIL dismissed on RRR
ఆర్ఆర్ఆర్ సినిమా ఫిల్ కొట్టివేత

By

Published : Mar 15, 2022, 10:54 PM IST

PIL dismissed on RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ దాఖలైన పిల్​ను హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కుమురంభీం చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

ఆర్ఆర్ఆర్ కేవలం కల్పిత కథ మాత్రమే...

RRR: అల్లూరి సీతారామరాజును పోలీసుగా చూపి చరిత్రను వక్రీకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అల్లూరి, కుమురంభీంలను దేశభక్తులుగానే చూపామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ కేవలం కల్పిత కథేనని వారు వాదించారు. సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కూడా జారీ చేసిందన్నారు.

ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. సినిమా ప్రదర్శన నిలిపివేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ సినిమాతో అల్లూరి సీతారామరాజు, కుమురంభీంల పేరు, ప్రతిష్ఠలకు భంగం కలగదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విషం సోక్రటీస్​ను చంపుతుంది కానీ.. ఆయన సాహిత్యాన్ని కాదని వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి:RRR Movie: బాహుబలిని మించి 'ఆర్​ఆర్​ఆర్​'.. తారక్​, చరణే ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details