ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా(special status of Andhra Pradesh) ఇవ్వకపోవడానికి కారణాలేమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు(AP high court news) ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదో తెలపాలని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం సైతం వివరాలు సమర్పించాలంది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
AP high court news : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికి కారణాలేంటి ?
ఏపీకి ప్రత్యేక హోదా(special status of Andhra Pradesh) ఇవ్వకపోవటానికి కారణాలేమిటో చెప్పాలని కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP high court news ) ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.
పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా(special status of Andhra Pradesh) ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేశ్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.రామారావు వాదనలు వినిపించారు. ఏపీని ఆదుకునేందుకు అప్పటి ప్రధాని పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈశాన్య , హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా(special status of Andhra Pradesh) ఇచ్చిన కేంద్రం .. ఏపీ విషయంలో హామీని నిలబెట్టుకోలేదన్నారు. ధర్మాసనం(AP high court news) స్పందిస్తూ .. పలు రాష్ట్రాలకు హోదా ఇచ్చినప్పుడు ఏపీ విషయంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. విభజనతో ఏపీ నష్టపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్కీ హరినాథ్ వాదనలు వినిపిస్తూ .. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు(supreme court news today)లో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా(special status of Andhra Pradesh) పొందిన రాష్ట్రాలకు ఏపీకి భౌగోళిక పరిస్థితుల విషయంలో తేడా ఉందన్నారు.
- ఇదీ చదవండి :ఫలించిన అన్నదాతల పోరాటం.. సాగు చట్టాలు రద్దు