ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... చేస్తున్న ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం గ్రామంలో మంచికలపూడి ఉమామహేశ్వర రావు అనే రైతు ప్రాణాలు విడిచారు.
అమరావతి పోరులో ఆగిన మరో రైతు గుండె - Amravati movement Latest News
ఏపీలోని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. కృష్ణాయపాలెంలో మంచికలపూడి ఉమామహేశ్వరరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. ఉమామహేశ్వరరావు... రాజధాని కోసం ఎకరం 14 సెంట్ల భూమి ఇచ్చారు.
రాజధాని కోసం ఆగిన రైతుల గుండె
ఉమామహేశ్వర రావు రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఒక ఎకరం 14 సెంట్ల భూమి ఇచ్చారు. అమరావతి ఏమైపోతుందో అన్న మనోవేదనతోనే రైతు మరణించినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:'ఆ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు'